DISPLACED VOICES
The purpose of this BLOG is to connect to the world of displaced voices who have become the victims of developmental politics. It supports their struggle and propagates their agony and pain...
Tuesday, 18 December 2012
Friday, 21 September 2012
Saturday, 15 September 2012
Wednesday, 7 December 2011
ఆదివాసుల అంతానికే పోలవరం ప్రాజెక్ట్
"ఆదివాసులకు స్వీయ నిర్ణయ హక్కు ఉంది "--ఐక్యరాజ్య సమితి ఆదివాసి హక్కుల ప్రకటన ...
పోలవరం కదిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో గత పక్షం రోజుల్లుగా చర్చోపచర్చలు చెలరేగుతున్నాయి.లాలుచి నిరుపిస్తామని ఒకరంటే దమ్ముంటే నిరుపించమని మరొకరు, ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తే సకలజనుల సమ్మెను ఆపినందుకు నజరానా అని మరికొందరు, త్వరలో పనిమొదలవుతుందని ప్రభుత్వం ప్రకటిస్తే న్యాయపోరాటమని కాంట్రాక్టర్లు ...వెరసి విషయమంతా అవినీతి, అర్హత అనర్హతల కేంద్రంగానే కొనసాగుతున్నది.అయితే పోలవరం(ఇందిరా సాగర్ ) ప్రాజెక్ట్ అంతకే పరిమితం కాదు. ఇందులో మానవహక్కులున్నాయి. ఆదివాసి హక్కులున్నాయి. అభివృద్ధి రాజకీయలున్నాయి.వాటి పేరిట జరిగే విధ్వంసాలున్నాయి.బహుళజాతి సంస్థల ప్రయోజనాలున్నాయి. ప్రశ్నార్థక మవుతున్న ప్రజాస్వామ్య విల్లువలున్నాయి.అందుకే ఇది నాగరిక ప్రజలు ఆలోచించవలసిన సమయం, స్పందించవలసిన సందర్భం.
కేంద్ర జలవనరుల శాఖ -1986లో తయారు చేసిన "గోదావరి సుజల సాగర డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ "ప్రకారం ఇది ఒక బహులార్థక సాధక ప్రాజెక్ట్ .దేశంలోని 2 .8 కోట్ల ఎకరాలలో చెరువులు, కుంటలు బావులు, బోర్లు ద్వార కేవలం 80 లక్షల ఎకరాలే సాగవుతున్న నేపద్యంలో(దేశవ్యాప్తంగా 22 .2 శాతం, యు.పి ౨౪, పంజాబ్ ౩౫ శాతం, కాగ ఏ.పి 14 శాతం మాత్రమె.).ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ పట్టణం, ఉభయ గోదావరి,కృష్ణ జిల్లాలలో 7 .21 లక్షల ఎకరాలలో సాగునీరు, విశాఖ పట్టణం స్టీల్ ప్లాంట్ మరియు పారిశ్రామిక సంస్థల అవసరాలకు 23 .44 టే.ఎం సి లు, కృష్ణానదికి 84 . 8 టే.ఎం సి ల నీటి మళ్లింపు 600 గ్రామాలకు తాగునీరే కాకుండా 960 మెగావాట్ల సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి ఇంకా అనేకానేక పథకాలతో సుమారు 2665 కోట్ల పెట్టుబడితో (నేడు 17 వేల కోట్లకు పైగా )36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ అంచనాతో పోలవరం, దేవిపట్టణంల మధ్య నిర్మించ తలపెట్ట బడింది.
ఈ ప్రాజెక్ట్ కారణంగా ఖమ్మం జిల్లా లోని వి ఆర్ పురంమండలం లో 45 గ్రామాలూ ,కూనవరం మండలంలో48 గ్రామాలు , చింతూర్లో 17 గ్రామాలు, భద్రాచలం లో 13 గ్రామాలు,బూర్గంపాడు లో 9 గ్రామాలు, కుకునూరు లో 34 గ్రామాలు, వేలెరుపాడులో 39 గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయి.అలాగే ప.గోదావరి జిల్లా పోలవరం మండలం లో 29 గ్రామాలు,తూ.గోదావరి దేవీపట్నం మండలం లో42 గ్రామాలు మునుగుతున్నాయి.ఒదిస్సా,చత్తీస్ గడ్ లలో వరుసగా 7 గ్రామాలు , 10 గ్రామాలు మునకకు గురి అవుతున్నాయి.
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ వలన 276 గ్రామాలు (వాస్తవంగా 350 గ్రామాలు ) లోని రెండులక్షల మంది (నేడు మూడు లక్షలు )ప్రజలు ,అందులో రెండు లక్షల మంది ఆదివాసులు నిర్వాసిత్వానికి , దాదాపు లక్ష ఎకరాల భూమి,637 చ,కి.మీ.విస్తీర్ణంలో షెద్యుల్డ్ ప్రాంతం,దాదాపు ఎనిమిది వేల రిజర్వు ఫారెస్ట్ జలసమాధికి గురి అవుతున్నాయి.అంతె కాక పేరంతాలపల్లి,శ్రీరామగిరి,భద్రాచలం లాంటి పర్యాటక పుణ్య స్థలాలు ఆదివాసుల నిత్యజీవితంలో ఆహారంగా ఉపయోగపడే దుంపలు,కాయలు, గడ్డలు,వేలాది ఔషధ మొక్కలు,ఆహారంగానే కాదు ఆదాయాన్నిచ్చే ఊరుమ్మడి చింతచెట్లు,తాటిచెట్లు,తాము దైవంగా భావించే ఇప్పచెట్లు(ఇప్పపూవు,సారా,వంటనూనె ),ఈతచెట్లు,వెదురు,కలప,జిగురు,కోట్లాదిరూపాయల బిజినెస్ అయిన బీడిఆకు మరియు భూమిలోని అత్యంత విలువైన ఖనిజ వనరులు జంతుజాలం...అన్నీ కనుమరుగు కానున్నాయి.
దేశంలోనే అత్యంత విధ్వంసకర అసమాన అభివృద్ధి కి నమూనాఐన పోలవరం ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు చట్టపరంగా ఎటువంటి అనుమతులు లభించక పొయినా (కేవలం పేపర్ వర్క్ చేసుకోవచ్చని ఏప్రిల్ 25 , 2007 న సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది )నిర్మించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే !ఈ దేశ రాజ్యాంగం ఆదివాసులకు ఎన్నో విధాలైన హక్కులు, రక్షణలు కల్పించింది.ఐక్యరాజ్య సమితి ఆదివాసీ హక్కుల ప్రకటన లో పేర్కొన్న - ఆదివాసులకు స్వీయనిర్ణయము లో భాగంగా వారి వ్యవహారాల విషయంలో స్వయంప్రతిపత్తి లేదా స్వయంపాలనా హక్కు ఉంది(ఆర్టికల్ 4 ), ఆదివాసీ హక్కులకు భంగం కలుగ చేసే విధానాలు,శాసనాలు అమలు చేసేముందు ప్రభుత్వం ఆదివాసులతో సంప్రదింపులు జరిపి అనుమతి పొందాలి(ఆర్టికల్19),ప్రజబిష్టం,ఆదివాసుల అనుమతి లేకుండా ఆదివాసీ ప్రాంతాలలో ఎటువంటి మిలిటరీ కార్యక్రమాలను నిర్వహించారాడు(ఆర్టికల్ 30 )-లాంటి అంశాలకు లోబడి ఉంటానని భారతదేశం ప్రకటించింది.భూముల పరాయికరణను నిరోధించేందుకు 1 /70 చట్టం,అటవీ సంరక్షణ చట్టం-1980 ,పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ,షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయితీరాజ్ చట్టం(పెసా)-1996 , అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 లాంటి పలు చట్టాలను రూపొందించింది.వీటి ద్వార గ్రామసభలకు అత్యున్నత అధికారాలు సంక్రమించాయి.తమ భవిష్యత్ ను తామే నిర్ణయించుకునే స్వేచ్చ లభించింది. మరి ఏ గ్రామ సభ అనుమతితో ఇంత దుర్మార్గమైన ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం సాహసిస్తుందో తెలుప గలదా ?ఒక్క అనుమతినైనా ప్రభుత్వం చట్టానికి లోబడి సంపాదించింద ?సైట్ క్లియరెన్స్ 19 సెప్టెంబర్ 2005 నాడు అనుమతి పొందినప్పటి నుండి పెట్టుబడులకు 25 ఫిబ్రవరి 2009 న,26 డిసెంబర్ 2009 (తెలంగాణా ఉద్యమం శిఖరాగ్ర స్థాయిలో ఉన్నపుడు)న అటవీశాఖ అనుమతులు పొందినప్పటి వరకు అన్ని వివిధ ప్రభుత్వ విభాగాలు ఇచ్చినవే కదా?
"అప్పట్లోనే కొన్ని పార్టీలు ప్రాజెక్ట్ ఫైవ్యతిరేక వ్యాఖ్యలు వినిపించినా...అన్నింటినీ సమాధాన పరచి ,ఎంత భారీవ్యయాన్నైన భరించడానికి సిద్దపడి ప్రాజెక్ట్ సత్వర నిర్మాణానికి ఆయన (వై.ఎస్.అర్)సంకల్పించారు."(చూ:సాక్షి,17 నవంబర్ 2010 ,౩వ పేజి ).వీటి అర్థం ఈరోజు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న వారికి సులభంగానే అర్థం అవుతుంది.
ఇప్పటికే రెండు పంటలు పండిస్తున్న కృష్ణా,ఉభయగోదావరి జిల్లాలకు మూడవ పంటకు నీటిని అందివ్వడానికి,బహుళజాతి కంపనీల,కాంట్రాక్టర్ల కమిషన్లకు లొంగి ఆదివాసీ ప్రాంతాలను,ప్రజలను అమానవీయంగా జలసమాధి చేయడానికి వ్యతిరేకంగా ముంపు ప్రాంతాలలో తీవ్రమైన ఉద్యమాలు ఎగిసాయి.తమ సాంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు,బాణాలు,గోడ్డండ్లతో నిరసన తెలిపారు."పోలవరం ప్రాజెక్ట్ గురించి సర్వే చేయడానికి వచ్చే అధికారులకు ప్రవేశం నిషిద్దం" అని పోస్టర్లు,బ్యానర్లు ప్రతి గూడెంలో పెట్టారు.కూనవరం మండలంలో కరకగూడెం గ్రమసభకు వెళ్ళిన బృందాన్ని ఐదు గంటలకు గదిలో నిర్భందించారు.ఎం.అర్.ఓ ,ఎం.పి.డి.ఓ లను ఘెరావ్ చేసారు.వేలాదిమంది ఆదివాసీలు ర్యాలీలు,ధర్నాలు,భారీ బహిరంగ సభల ద్వారా సమరభేరి మోగించారు.హక్కుల సంఘాలు,ఆదివాసీ,విద్యర్థిసంఘాలు,ప్రజా సంఘాలు,సామజిక,పర్యావరణ వేత్తలు,మేధావులు అందరూ పోలవరం ప్రాజెక్ట్ ను ప్రజా వ్యతిరేక ప్రాజెక్ట్ గా అభివర్ణిస్తూ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసారు.అయినా ప్ల్రభుత్వం లెక్కచేయకుండా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూనే ఉంది.గత కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల తవ్వకానికి సుమారు 3500 కోట్లను కాంట్రాక్టర్ల దోసిట్లో పోసి ప్రజల నోట్లో మన్ను గొట్టింది.ఉద్యమ ప్రాంతాలలో 144 సెక్షన్లు,అరెస్టులు,కాల్పులతో భాయోత్పాతలను సృష్టిస్తోంది.
గత కొంతకాలంగా తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతుంది.రేపో మాపో రాష్ట్రము ప్రకటిస్తారేమోననే ఊహాగానాలు వినబడుతున్నాయి.ఈ తరుణంలో సీమాంధ్రకాంగ్రెస్ ప్రభుత్వం,కాంట్రాక్టర్లు కుమ్మక్కై,తమ ప్రాంతానికి సిరులు పండించే పోలవరంప్రాజెక్ట్ ను సాధ్యమైనత త్వరగా పుర్తిచేసుకొనే కుట్రలో భాగంగానే నేడు రెండవదశ టెండర్ల ప్రక్రియ ను మొదలు పెట్టారు.4717 విలువైన నిర్మనపనులను చేజిక్కించుకోడానికి ఏడు స్థానిక,దేశీయ,విదేశీ సంస్థలు పోటి పడ్డాయి .ప్రాధమిక స్థాయిలోనే మూడు కంపనిలను అనర్హతకు గురికాగా,ప్రాంతీయ (తెలంగాణా )సంస్థ "స్యు-పటేల్-ఎఎమ్మార్ వెంచర్ " 12 .61 శాతం తక్కువకు మోసపూరితంగా టెండర్లను కోట్ చేసి పొందింది.ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన విలువకల పనులు చేయకున్నా,తప్పుడు అనుభవ సర్టిఫికేట్ ను సమర్పించి మోసపూరితంగా టెండర్లు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఒక పార్టీపై మరొక పార్టీ పోటి పడి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.తమతమ పార్టీలలోని కాంట్రాక్టర్ల తరుపున వకాల్త పుచ్చుకొని (పార్టీ ఫండ్ ఇవ్వరనేమో !)టెండర్ల అవినీతి,అక్రమాలపై రక్తి కట్టేలా నాటకాలడుతున్నాయి.తెలంగాణా రాష్ట్ర సాధన,వనరుల పరిరక్షణ పై నేడు అన్ని పార్టీ లు ప్రగల్భాలు పలుకుతున్నాయి.తెచ్చేది మేమే,ఇచ్చేది మేమే అని ఒక పార్టీ,అసలందు కొరకే పుట్టామని మరొక పార్టీ,మాకు రెండు ప్రాంతాలు సమానమే నని మరొక పార్టీ అంటున్నాయి కానీ ఎ ఒక్క పార్టీ పోలవరం ప్రాజెక్ట్ ను నిలిపివేయల్సిందే నని ఖచ్చితంగా మాట్లాడక పోగా కేవలం టెండర్ల రద్దు గురించే రచ్చ చేయడం దేనికి సూచన?నష్టపోతున్నది నోరులేని ఆదివాసులనేగా ఈ చులకన??
ఇది కేవలం టెండర్లకు,అవినీతికి మాత్రమే సంబంధించిన అంశం కాదు.ముందే అనుకున్నట్లు ఇది లక్షలాదిమంది ఆదివాసుల జీవన్మరణ సమస్య.భారత రాజ్యాంగం కల్పించిన గౌరవంగా జీవించే హక్కు సమస్య.ప్రజాస్వామిక విలువల సమస్య.అందుకే అభివృద్ధిని ఎవరు ఎలా నిర్వచిస్తున్నారో స్పష్టం కావలిసి ఉంది.ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణాలు,నగరాలకు మరింత సౌకర్యాలను కల్పించడానికి రోడ్లు,కరెంట్,తాగునీరు,విద్య,వైద్యంలాంటి కనీస సౌకర్యాలు కూడా లేని అదివాసిప్రాంతాలు,ప్రజలు ఎందుకు బలి కావాలో పాలకులు సంధనమివ్వవలసి ఉంది.వలస పాలనా కాలం నాటి చట్టాలకు మెరుగులు దిద్దుతూ భారతదేశం నయావలస దేశంగా మారి కోట్లాదిమంది ప్రజలను నిర్వాసితులను చేసే విధానాలను ప్రజాస్వామికవాదులు ప్రశ్నించవలసి ఉంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అభివృద్ధి పేరిట నిర్వాసిత్వానికి గురైన వారిలో 40 శాతం ఆదివాసులు,18 . 96 శాతం అదివాసులే ఎందుకు ఉన్నారో మానవతావాదులు ఆలోచించాలి.ఇంత హటాత్తుగా
అడివాసిప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వాలు పడుతున్న ఆరాటం వెనుక కారణం వారి కాళ్ళ కింద ఉన్న లక్షల కోట్ల సంపదే కదా!
ఇప్పటికే ఆదివాసి సమాజం అల్లకల్లోలంగా ఉన్నది.లక్షలాదిమంది ఆదివాసులు ప్రభుత్వాలు సృష్టించిన "వారి వేలితోనే వారి కన్నును పొడిపించే సిద్దాంతంతో నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు.త్రాగడానికి మంచినీరు,జ్వరమొస్తే మందుబిల్ల దొరకనంత దయనియస్థితిలో బ్రతుకుతున్నారు.ఆఖరికి నగరవాసుల మానసికోల్లాసానికి ఉపయోగపడే "జూ"లోని జంతువుల పట్ల చూపే శ్రద్ద మాపైన లేదెందుకని నిలదీస్తున్నారు.ఇప్పుడు పోలవరం పేరు మీద నిర్వాసితుల్ని చేస్తే నగరాలలో "ఆదివాసి మానవ ప్రదర్శన శాల "లో తప్ప మరో విధంగా బ్రతుక లేమని ఆందోళన చెందుతున్నారు.ఆదివాసుల సంస్కృతీ ,ఉనికిని నాశనం చేసే ఫాసిస్టు విధానాల పట్ల భీతిల్లుతున్నారు.అందుకే ఆదివాసి జాతి అంతానికి కారణమయ్యే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆందరూ నిర్ద్వందంగా వ్యతిరేకించాలి.భారత రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు రక్షణలను అమలు చేసేలా ప్రభుత్వాలను ఒత్తిడి చేయవలసి ఉన్నది."అడవిపై హక్కు ఆదివాసులదే కానీ ప్రభుత్వాలది కాదు "అని నినదిద్దాం.ఆదివాసి ఉద్యమాలకు దన్నుగా నిలబడడం నాగరిక సమాజాల నైతిక భాద్యతగా గుర్తిద్దాం.రద్దు చేయవలసింది టెండర్లను కాదు పోలవరం ప్రాజెక్ట్ నని డిమాండ్ చేద్దాం.ప్రతిదానికి ఒక ఆరంభం ఉన్నట్లే అంతం కూడా ఉంటుంది.కదిలిన పోలవరం జల్,జంగల్,జమీన్ కొరకు పోరాడిన కొమరం భీమ్ స్పూర్తితో డిల్లీని తప్పక కదిలిస్తుంది.
జంజర్ల రమేష్ బాబు,కో కన్వీనర్
పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఐక్య పోరాట వేదిక

Friday, 2 December 2011
జాతీయ భూసేకరణ -నష్టపరిహారం , పునరావాస చట్టం -2011 ముసాయిదా (ప్రజా) ప్రయోజనలేవరివి ...?
పారిశ్రామిక విప్లవం సమాజ గతిశీలతను ఒక కుదుపు కుదిపింది .మానవశ్రమ ద్వారా జరిగే ఉత్పత్తికి అనేక రెట్లు యంత్రాల ద్వారా ఉత్పత్తి ని సాధించే అవకాశం కలిగింది .యాంత్రీకరణ వేగవంతం అయ్యింది. పారిశ్రామికీకరణ నగరీకరనకు దారి తీసింది .పెట్టుబడి లాభాల రుచి మరిగింది. సముద్రాలను , ఖండాలను దాటి -మార్కెట్ల వేటలో - ప్రపంచ వ్యాప్తంగా అలాగే భారత దేశంలో ప్రవేశించింది .ఈ దేశాన్ని ఆక్రమించుకుని వందల సంవత్సరాల పాటు యధేచ్చగా సాగించిన వలసదోపిడీ పాలనలో అనేక నల్ల చట్టాలను రూపొందించింది ."సంపదపై , భూమిపై అంతిమంగా అధికారం ప్రభుత్వానిదే (ఏమినేంట్ డొమైన్ ) " అనే సూత్రంతో 1894 భూసేకరణ చట్టం ద్వారా వనరుల రవాణాకు, ఉద్యమాల అణచివేతకు రోడ్లు, రైలు మార్గాలు,కమ్యూనికేషన్ లు, కార్యాలయాలు, పోలీసు, న్యాయవ్యవస్థ లాంటి వాటిని ఏర్పరచింది. అనేకమందిని నిర్వాసితుల్ని చేసింది . వలస పాలన పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం(అనుకుంటే) ఏర్పడినా, నాడు అలవాటు ఐన బానిస మనస్తత్వం, దళారీ స్వభావం పోలేదు. బ్రిటిష్ చట్టాలనే స్వల్ప్ల సవరణలతో కొనసాగిస్తూ పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం సర్వసాధారనమయ్యింది. 1894 భూ సేకరణ చట్టం మాత్రుకగా ఇప్పటికే 18 రకాల చట్టాలను తయారు చేసింది.లక్షలాది ఎకరాల పంటభూములను, బీడు,పోడు, భూములను, అటవీ భూములను అప్పనంగా కార్పోరేట్, మల్టీనేషనల్ కంపనీలకు ధారాదత్తం చేసింది.కోట్లాది మంది ప్రజలను అత్యంత అమానవీయంగా నిర్వాసితుల్ని చేసింది. ప్రభుత్వ దళారి స్వభావానికి వ్యతిరేకంగా, దేశ వ్యాప్తంగా -గోవా, సింగూరు,నందిగ్రామ్, నారాయణ పాట్నా, పోస్కో, నియమగిరి, కళింగనగర్, సోంపేట, గంగవరం పోర్ట్, కాకరాపల్లి, కొవ్వాడ, పోలవరం,లాంటి ప్రాంతాల్లో గత దశాభ్డానికి పైగా తీవ్రమైన నిర్భందాల నడుమ ప్రజలు పోరాటాలు కొనసాగిస్తున్నారు.ఈ నేపద్యం లో ఆగస్టు మొదటి వారంలో పార్లమెంట్ లో "జాతీయ భూసేకరణ -నష్ట పరిహారం, పునరావాస చట్టం-2011"ముసాయిదాను ప్రవేశ పెట్టి చట్టంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శతవిధాల ప్ల్రయత్నిస్తుంది.అందుకే అభివృద్ధి అంటే ఏమిటో, ఎవరి అభివృద్ధిని అభివృద్ధిగ పెర్కొంటుందో, ప్రజాప్రయోజనాలను ఎవరు ఎలా నిర్వచిస్తున్నారో, పెట్టుబడికి, దోపిడీ కి ప్రభుత్వాలు ఎలా సలాములు చేస్తున్నాయో పరిశీలించవలసి ఉన్నది.
కేంద్ర గ్రామీణాభి వృద్ది శాఖ ప్రవేశ పెట్టిన ఈముసాయీదా ముందు మాటలో "పట్టనికరణ,నగరీకరణ అనివార్య అవసరంగా" ప్రకటించడం జరిగింది.అంతేకాకుండా తయారీరంగం పై ఆధార పడిన పారిశ్రామిక రంగాల్ని వేగవంతం చేయడం, వివిధ ప్రజోపయోగ కార్యక్రమాల కొరకు భూసేకరణ తప్పనిసరని,ఐతే ఈ భూసేకరణ సులభంగా, పారదర్శకంగా జరిగేలా చూడడం "( పరిచయం, పేజి 4) దీని ముఖ్యోద్దేశాలుగా పేర్కొన్నారు .దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులైన, జీవనం కోల్పోయిన వారికి న్యాయం చేసేలా ఇప్పటివరకు సమగ్ర నష్టపరిహర, పునరావాస చట్టం లేకపోవడాన్ని గుర్తిస్తూ, మొట్టమొదటి జాతీయ భూ సేకరణ -నష్ట పరిహారం, పునరావాస చట్టం-2011" ను మానవీయ కోణంలో అమలులోకి తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. భూ సేకరణ - ఆర్ &ఆర్ ప్యాకేజీలు నాణేనికి రెండు ముఖాలుగా అభివర్ణిస్తూ రెండింటిని కలిపి చూడడం ద్వారానే సరైన న్యాయం లభిస్తుందని అజెండా లో (పేజి 4)అభిప్రాయ పడ్డారు.
భూ సేకరణ కారణంగా కోల్పోయిన భూమికి, చెట్లకు,తరలించ వీలుకాని ఇతర నిర్మానాలకి నష్టపరిహారాన్ని గ్రామీణ ప్రాంతాలలో ఆరు రేట్లకు తక్కువ కాకుండా,పట్టణప్రాంతాలలో రెండురెట్లకు తక్కువ కాకుండా(కనిష్ట నష్టపరిహర పథకం షెడ్యూలు-ii ,పేజి 9,సెక్షన్ 20 లో 3 రెట్లుగా,పేజి 16)ఉండేటట్లు, ప్రతి కుటుంబానికి రూ:3000/ ల చొప్పున 12నెలల జీవనభ్రుతి, రూ:2000/ చొప్పున 20 సం. రాల ఆన్యుటి చెల్లించేట్లు, 150 చ.మీ ,విస్తీర్ణం లో గ్రామీణ ప్రాంతాలలో 50 చ.మీ ,విస్తీర్ణం లో (2007 పథకంలో 75 చ,మీ.పల్లా త్రినాథ రావు, పోలవరం కాదు శాపం,జీ.ఓ.68 , పేజి 157 ) పట్టణప్రాంతాలలో ఇండ్లు కట్టి ఇచ్చేందుకు, రవాణ ఖర్చుల క్రింద రూ.50 000/, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా రూ. 2 00 000/ ఇచ్చేటట్లు చట్టంలో పొందుపరచారు. అంతే కాకుండా భూమిని సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరిస్తే ప్రతిపాదిత ఆయకట్టులో ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక ఎకరం భూమిని ఇచ్చేటట్లు (కలా?నిజమా??), నగరీకరణ కొరకు ఐతే దామాష పద్దతిలో 2 0%అభివృద్ధి చేసిన భూమిని రిజర్వ్ చేసేటట్లు,ఒకవేళ భూమిని 10సం. రాల లోపు బదలా ఇస్తే 2 0% విలువను సొంతదారుకు చెల్లించేటట్లుగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్సి, ఎస్టీల విషయంలో ఈ ముసాయీదా భూలోక స్వర్గాన్ని చూపిస్తుంది . తాము కోరుకున్న ప్రాంతంలో, సకల సదుపాయాలతో పాటు రాజ్యాంగ రక్షణలను, యధాతధంగా మరియు అదనపు ఆర్ధిక సహాయం తో పాటు కల్పిస్తామని హామీల వర్షం కురిపించింది.రక్షణల గురించి వివరిస్తూ -భూమిని 100 ఎకరాల పైబడి గనుక సేకరిస్తే సామాజిక ప్రభావ అంచనా (ఎస్ .ఐ. ఎ ) రూపొందించేటట్లు సంబంధిత ప్రాజెక్ట్ ప్రజా ప్రయోజనాల కోసమే అని నిర్దారించేట్లు చీఫ్ సెక్రెటరితో కూడిన కమిటీని నియమించడం, ఎ కారణాలవల్లనైనా 5 సం.రాల లో భూమిని నిర్దేశించిన అవసరాల కొరకు ఉపయోగించని యెడల -మరొక ప్రభుత్వ విభాగానికి ఉపయోగించుకునే వెసులుబాటుతో (పేజి 17)- నాలుగవ వంతు నష్టపరిహారంతో పాటు భూమిని సొంతదారుకు తిరిగి అప్పగించేందుకు చట్టంలో అవకాశం ఉన్నట్లు పేర్కొనడం ఇత్యాదివన్నీ భూ సేకరణ కొరకు ప్రభుత్వం ఎంతగా తహతహలాడుతున్నదో తెలియచేస్తుంది.
ముసాయిదా సెక్షన్ 1ఎ (1)మరియు 8 సెక్షన్ ప్రకారం -"ఎప్పుడైనా ప్రభుత్వానికి ఏదేని ప్రజాప్రయోజనాల రీత్యా, ఎ ప్రాంతంలోనైనా భూమి అవసరమని అనిపించినా సరే, సదరు భూమిని తన సొంతానికి స్వాధీనం చేసుకునేందుకు, కలిగి ఉండేందుకు, బదలాయించేందుకు ప్రభుత్వం హక్కును కలిగిఉంటుంది.అలాగే ప్రకటించబడిన, తక్షణఅవసరాల కొరకు ప్రైవేటు సంస్టలకు బదలాయించేందుకు ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చు"(కోట్సు నావి )అన్నది సారాంశం.అంతే కాకుండా ఒకసారి ప్రజాప్రయోజనం అని ప్రకటించిన తరువాత దానిని మార్చేందుకు వీలుకాదన్నది కూడా ఇందులో ఉన్నది.ఇక్కడే అసలు సమస్య మొదలు అవుతుంది.ప్రజాప్రయోజనం అంతే ఏమిటి?దానిని ఎవరు నిర్ణయిస్తారు?దాని కొరకు నిర్థిష్ట యంత్రాంగం ఏదైనా ఉందా?ఆ ప్రజా ప్రయోజనంలో నిర్వాసితుల పాత్ర ఏమిటి?ఎందుకంటే ప్రభుత్వం, భూమిని కోరుకునే కార్పోరేట్,మల్టీనేషనల్ కంపనిలకు ఇష్టానుసారం ధారాదత్తం చేసేందుకు ఇది వీలుకల్పిస్తుంది.అంతేకాకుండా 120 కోట్ల మందికి అన్నం పెట్టే వ్యవసాయం గురించి ఇందులో ప్రస్తావన లేకపొగా వేలకోట్ల రూపాయల పెట్టుబడితో, లక్షల కోట్ల సొంత లాభాల కోసం పెట్టుకునే ప్రైవేటు పరిశ్రమలను ప్రజాప్రయోజనాల కోటాలో చేర్చడం వెనుక మతలబు ఏమిటి?ఒకవేళ ఎ.పి. ఐ. ఐ. సి లాంటి సంస్థలు ప్రజాప్రయోజనాల పేరిట భూమిని సేకరించి అతితక్కువ ధరలకు ప్రైవేటు సంస్థలకు బదలాయించినపుడు ఎం చేయగలం?(జరుగుతున్నదదే ) గత దశాబ్ద కాలంగా భారతదేశ వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ అనుభవాలు -భూ కేటాయింపులలో గత ప్రభుత్వాల అవకతవకల మీద జరుగుతున్న చర్చలు, ఆరోపణలు, నిర్వాసితుల ఆందోళనలు, పోరాటాలు - వీటిని రుజువు చేస్తున్నాయి. అందుకే ప్రజా ప్రయోజనాన్ని నిర్వచించే , ఒక సంస్థకు లేదా ఒక కంపెనీకి ఎంత భూమి కావాలో అంచనా వేయగల ప్రభుత్వేతర, మేధావుల, ప్రజాసంఘాల తో కూడిన ఒక నిర్థిష్ట భూ సలహా మండలి ఏర్పాటు కావలిసి ఉన్నది. అది గ్రామస్థాయి వరకు అనుసంధానించాలి.
సెక్షన్ (౩)ప్రకారం జరిపే సామజిక ప్రభావ అంచనా కూడా తూ తూ మంత్రంగానే ఉన్నది.100 ఎకరాలు అంతకు పైబడి భూ సేకరణ జరిగే సందర్భం లోనే ఇది వర్తిస్తుందనడం(99ఎకరాలయినపుడు?) కుట్రపూరితం .ఇది ప్రభుత్వం ప్రకటించి మానవీయ కోణాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది.అటవీ ప్రాంతాలలో విసిరేసినట్లుండె చిన్న చిన్న గూడాలను ఉద్దేశించి చేసినట్లుగానే ఉన్నది ఈ ప్రతిపాదన. నష్ట పరిహారాన్ని తప్పించుకొనుటకు, 99 ఎకరాల సొంతదారుల అభిప్రాయాలకు విలువ లేక పోవడం వల్ల, ఒక ప్రాజెక్ట్ ను చిన్న చిన్న భాగాలుగా విడదీసి ఇక్కడ సర్వే అవసరం లేదనే పరిస్తితికి అవకాశం ఎక్కువ. అభ్యంతరాలను వినేందుకు, రికార్డు చేసేందుకు వీలుకల్పించే సెక్షన్-4 ఎప్పుడు నిర్వహిస్తారు? సర్వేకు ముందా లేక తరువాతనా? భౌతిక వస్తువుల, ఆర్ధిక విషయాల నష్టాన్ని అంచనా వేయవచ్చు కానీ సాంస్కృతికంగా మానసికంగా జరిగే నష్టాన్ని, నష్ట పరిహారాన్ని ఎలా అంచనా వేస్తారు? ఒకవేళ ప్రభావ అంచనా రిపోర్టు వ్యతిరేకమైతే దాని అప్రూవల్ ను నిరాకరించే స్వతంత్రత, ధైర్యము ప్రభుత్వ ఉద్యోగుల కమిటికి ఉంటుందా? అంతేకాకుండా ఈ మొత్తం ప్రక్రియ లో ఎస్ ఐ ఎ సర్వే బృందం-నోటిఫికేషన్ ప్రకటించే కలెక్టర్ తో సహా- గ్రామ సభ ను "సంప్రదించాలన్న" (consult) సూచనే ఉన్నది కానీ అంగీకారం (consent) అవసరమనే క్లాజు లేనప్పుడు 80 % ప్రజల అంగీకారం అన్నమాట హాస్యాస్పదమే అవుతుంది. అభ్యంతరాలకిచ్చిన అవకాశాలన్నీ నిర్వాసితులు తమ నష్ట పరిహారాన్ని, పునరావాస మొత్తాన్ని పెంచుకునేందుకు జరిపే బేరసారాల ప్రక్రియే కదా?! ఒకవేళ అభ్యంతరాలను తెలియచేసినా ప్రభుత్వ నిర్ణయమే అంతిమమనడం రాజ్యాంగం గ్రామ సభకు ఇచ్చిన అధికారాలను ప్రశ్నించడంతో సమానం అవుతుంది.
కోల్పోయే భూమికి మార్కెట్ వేల్యూ నిర్ణయించే సెక్షన్ 20 ,ఇండియన్ స్టాంప్ ఆక్ట్ 1899 పై ఆధారపడి గత 3 సం.లుగా ఆ ప్రాంతంలో అధికధర పలికిన 50%భూముల సగటు లావాదేవిల ఆధారంగా మార్కెట్ వేల్యూ నిర్ణయించే అధికారం కలెక్టర్ కు కల్పిస్తుంది.భారి రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించుకునేందుకు సాధారణంగా విలువను తక్కువగా చూపిస్తారు.అందువల్ల ప్రభుత్వం ప్రకటించే పరిహారం అసలుకన్నా తక్కువగానే ఉంటుంది. అంతేగాక పట్టాలేని భూములు, పోడు భూములు, ఎల్ .టి. ఆర్ భూములు, ఫారెస్ట్ రైట్స్ ఆక్ట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారి విషయం ఈ ముసాయిడా చర్చించదు.అంతేగాక బినామీ పేర్లతో, తప్పుడు ధ్రువ పత్రాలతో ఆదివాసి ప్రాంతాలలో భూములు కలిగిన గిరిజనేతరులు కూడా ఉంటారు. వారికీ నష్టపరిహారం, పునరావాసం కల్పించేతట్లయితే 1/70 ,పెసా,ఎఫ్. ఆర్. ఎ లాంటి చట్టాల అస్తిత్వం ఏమిటి?అలాగే దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకుంటే వారు మళ్లీ వ్యవసాయ కూలిలుగానో వలస కూలీలుగానో మారక తప్పదు
పునరావాస విషయానికి వస్తే నిర్వాసితులకు నివాస స్థలం కొరకు ఆటవిప్రాంతాన్ని నరికి ఏర్పాటు చేస్తారా లేక పట్టణ ప్రాంతాలలో కేటాయిస్తారా?నిర్వాసితులు చిన్నమొత్తంగాఐతే ఏమో గాని పోలవరం లాంటి మూడు లక్షల మందిని నిర్వసితుల్ని చేసే భారీప్రాజెక్ట్ ల విషయంలో అంతమందికి ఒకే ప్రాంతంలో గృహవసతి సాధ్యమవుతుందా?(ఆర్.ఉమా మహేశ్వరి:ఎ బిల్ దట్ ఫెసిలిటెట్స్ డిస్ ప్లేస్ మెంట్,ద హిందూ, సెప్టెంబర్ 13 ఎడిట్ పేజి ).ఇప్పటికే ఓజోను పొరకు చిల్లులు అని, పారిశ్రామిక వ్యర్థాల కలుషితం తగ్గించాలని, ప్రతి మనిషి ఒక చెట్టు నాటాలని, జనాకర్షక నినాదాలు ఇచ్చే ప్రభుత్వం అంత పెద్ద మొత్తం లో అడవిని నిర్మూలించి తనే పర్యావరణ కాలుష్యానికి, రాజ్యాంగ ఉల్లంఘనలకు కారనమవుతుందా ? ఇప్పటికే పట్టణ ప్రాంతాలు జనాభాతో నిండిపోయి మురికివాడలుగా మారిపోతున్నాయి.ఇంతమంది నిర్వాసితులకు ఇక్కడ పునరావాసం కల్పిస్తే వారికీ స్టానికులకు మధ్య వైరుధ్యాలు, ఘర్షణలు ఏర్పడే పరిస్తితి వస్తే ప్రభుత్వం వద్ద ఉన్న పరిష్కారాలేమిటి? (బహుశ పోలీసు వ్యవస్థ ను ఉపయోగిస్తారేమో !) వీటి కారణగా పట్టణ ప్రాంతాలలో భూముల కృత్రిమ కొరత సృష్టించడానికి, రియల్ ఎస్టేట్ ధరలు చుక్కల నంటడానికి ప్రభుత్వమే కారణమవుతుంది.అంతే గాక నిర్వాసితులు కోల్పోయిన భూమికి నష్టపరిహారంగా ప్రతిపాదిత ఆయకట్టులో కుటుంబానికో ఎకరం ఇచ్చేందుకు అక్కడి రైతు అంగికరిస్తాడా?లేదంటే అక్కడి మార్కెట్ రేట్ ఆధారంగా మళ్లీ నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం తయారవుతుందా?దాదాపు లక్ష ఉద్యోగాల కల్పన కలగానే మిగిలి పోతుంది.ఇది ప్రభుత్వం భాదితులపై వేసే క్రూర పరిహాసము అవుతుంది.
ప్రభుత్వాల కుట్ర, లిటిగెంట్ స్వభావం తెలిసిన వారికీ మాత్రమే అర్థమయ్యే విషయం ఈ ముసాయిదాలో సెక్షన్ 7 (2),(డి)లో దాగున్నది. వ్యవసాయ భూముల్ని ఆఖరి అవకాశంగా మాత్రమే సేకరిస్తారని, బహుళ పంటభూములను ఎట్టి పరిస్తితులలోను తీసుకో బడవని దాని సారాంశం. దేశంలో సాగుకు యోగ్యమైన భూములలో కేవలం ౩౦ నుండి 40 శాతం భూములకే సాగునీటి సదుపాయం ఉన్నది.నీటి వసతి లేని చెరువుల కింద, బావుల కింద, సాగుచేసే వర్షాధార వ్యవసాయ భూములన్నింటి మీద ఈ బిల్లు పడగ నీడ పడనుంది.ఆంధ్రప్రదేశ్ ను తీసుకుంటే సాగునీటి సౌలభ్యంకల కోస్తాంధ్ర ప్రాంతాన్ని మినహాయిస్తే (సోంపేట, కాకరపల్లి లాంటివి జరగవనుకుంటే ) తెలంగాణా, ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాలలో సాగునీటి సదుపాయం లేని భూములు ఒక్కటి కూడా మిగలవనేది అక్షరసత్యం.ఇప్పటికే రాజధాని చుట్టూ ఉన్న లక్షలాది ఎకరాలను -సెజ్ లకు, హై టెక్ సిటి, రింగ్ రోడ్, గ్రేటర్ హైదరాబాద్, ఎయిర్ పోర్ట్, నగరీకరణ ల పేరిట -చంద్రబాబు నాయుడు, వై .ఎస్ రాజశేఖరరెడ్డి ల ప్రభుత్వాలు ఎం.ఎన్.సి లకు, అస్మదీయులకు దోచిపెట్టడం మనందరికీ తెలిసిన విషయమే ! ఇంకా ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్స, లాంటి ఆదివాసీ ప్రాంతాలు వాటికింద ఉన్న లక్షలకోట్ల డాలర్ల సంపదను టాటా, జిందాల్, మిట్టల్, ఆర్సెలర్, సలీం, వేదాంత, పోస్కో లాంటి బహుళజాతి కంపనిల పరం చేయడమే దీని ముఖ్యోద్దేశంగా కనపడుతుంది.ఈ మొత్తం విషయాల ఆధారంగా ఈ చట్టం కేవలం రూపంలో మానవీయ దృక్పథం తో నిర్వాసితుల సమస్యల పరిష్కార మార్గంగా వచ్చినట్లు కనబడి నప్పటికీ సారంలో అది పాలకవర్గాల, పెట్టుబడిదారుల,మల్టీ నేషనల్ కంపని ల డాలర్ల దాహాన్ని తీర్చేందుకు మాత్రమే దోహద పడుతుందన్నది వాస్తవం.
అసలు అభివృద్ధి అంతే ఏమిటి?ఎవరి అభివృద్ధిని నిజమైన అభివృద్దిగా గుర్తించాలి?ఎవరి అభివృద్ధికి ఎవరు త్యాగం చేయాలి?నగరాల కొరకు, అతవిప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఎందుకు నిర్వాసితులు కావాలి?సమస్త సంపద సృష్టికర్తలైన శ్రామిక ప్రజలందరూ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలతో సహా సామాజిక, రాజకీయ,ఆర్థిక,సాంస్కృతిక రంగాలలో మెరుగైన జీవన ప్రమాణాలు పొందడంగాను,దోపిడీ పీడన రహిత సమాజపు నూతన మానవులుగా ఆవిర్భవించడంను నిజమైన అభివృద్దిగా భావించవచ్చును.అంతేగాని ఒక వర్గం అభివృద్ధి కొరకు అనేకమంది నష్టపోవడం, నిర్వాసితులు కావడం,అసమసమజానికి దోపిడిసమాజానికి నిలువెత్తు నిదర్శనం .ఇంత హటాత్తుగా 65 సం.ల స్వతంత్రం తరువాత ప్రభుత్వాలకు ఆదివాసుల అభివృద్దిపై మమకారం ఎందుకు కలిగిందో బహిరంగ సత్యమే!అటవి ప్రాంతాలలో ఆదివాసుల కాళ్ళకింద ఉన్న లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే అపారసంపద కార్పొరేట్,మల్టీ నేషనల్ కంపని ల లాకర్ల లో కరెన్సీగా మారెందుకుకావలిసి ఉన్నది.అందుకు ప్రభుత్వాలను ప్రభావితం చేసేందుకు వాళ్ళు వేలకోట్ల డాలర్లను ముట్ట చెపుతున్నాను.యజమానుల అభిస్తానికి అనుగుణంగా ప్రభుత్వాలు డూ డూ బసవన్న పాత్ర పోషిస్తున్నాయి.దీన్ని వ్యతిరేకించే వారిపై , ఆదివాసులకు అండగా నిలిచే వారిపై -చట్టాలను,జైళ్ళను, పర మిలిటరీ బలగాలను ఉపయోగించి -యుద్దాన్ని ప్రకటిస్తున్నారు.విధ్వంసాలను సృష్టిస్తున్నారు."అధికారికంగా నిర్వాసితుల పూర్తీ సమాచారం లభించక పొయినాకొంతమంది పరిశోధకులు 1951-1995 మధ్య ఒడిస్స,కేరళ మరియు జార్ఖండ్ లలో నిర్మించిన 60%అభివృద్ధి ప్రాజెక్ట్ లను, ఆంధ్రప్రదేశ్ లో 80 % ప్రాజెక్ట్ లను పరిశేలించి 2004 లో అప్ డేట్ చేసిన విషయాల ఆధారంగా జార్ఖండ్,ఓడిస్సా లలో 30 లక్షల చొప్పున, ఆంధ్రప్రదేశ్ లో 50 లక్షలు, కేరళ లో 10 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో 70 లక్షలు,అస్సాంలో 20 లక్షలు, గోవాలో లక్షమంది ప్రజలు మొత్తంగా 27 మిలియన్ల మంది నిర్వసితులయారని అంచనా వేసారు.అలాగే దేశ జనాభా లో 8 .6 %గా ఉన్న ఆదివాసులు 40 %గా, దళితులు 18 .96 %గా అభివృద్ధి ప్రేరేపిత నిర్వాసిత్వానికిగురైనారు.(ఫెర్నాండేజ్ 2007 :204, టేబుల్ 1 &2,కోట్స్ నావి ) నగరాలలో సైతం పిడికెడుమంది మేలు కొరకు లక్షలాది మందిని మురికి కూపాలలోనికి నెట్టేస్తున్నారు.కోట్లాదిమంది ప్రజలను నిర్వసితుల్ని చేసి వారి భవిష్యత్తును అంధకారం లోకి నెడుతున్నారు.ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతున్న వారిపై లాటీలు, తూటాల వర్షం కురిపిస్తున్నారు.పదుల సంఖ్యలో ప్రాణాలను తీస్తున్నారు.పాలకవర్గాల, పెట్టుబడిదారుల దోపిడీకి గురికాని ప్రాంతమంటూ విడిగా లేదు.దోపిడీ దారులందరూఒక్కటిగానే ఉన్నారు.!పీడిత ప్రజలే నేడు ఒక్కటి కావలిసి ఉన్నది.
చివరగా,మార్పు సహజమైనది, అనివార్యమైనది కూడా.ఐతే అభివ్రుద్దికరమైన మార్పులు ప్రజలను భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తాయి.వ్యతిరేకమైన వాటికీ ఆమోదం లభించదు.ఆహారసేకరణ దశ నుండి గణసమాజాలు స్వయంపోషక గ్రామాలుగా పరివర్తన చెంది, గుణాత్మక మార్పులకు సజీవసాక్షాలుగా నిలుస్తాయి. స్వయంపోషక గ్రామాల మిగులు పంపిణి ప్రక్రియలో ఎదిగిన ఒక విశ్రాంత వర్గం దాన్ని వ్యక్తిగత ఆస్తిగా మార్చుకునే క్రమంలో అసమసమాజానికి పునాది ఏర్పడింది.తమ ఎదుగుదలకు అడ్డం వచ్చే ఆటంకాలను తొలగించడం లేదా నిర్మూలించ ప్రయత్నించడం ద్వారా పెట్టుబడిదారి వర్గాలు ప్రజలను మరింత పీడనకు గురి చేస్తారు.తద్వారా తమ వినాశనాన్ని తామే తయారుచేసుకుంటారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వంగా చెప్పుకునే భారతదేశం కూడా అందుకు మినహాయింపేమీ కాదని ముసాయిదా ముందుమాట (పేజి 1) లో "భూ సేకరణ, నష్టపరిహారం, మరియు పునరావాస ప్యాకేజి ప్రక్రియల కన్నా భూమిని ఎవరు పొందుతున్నారన్నవిషయం అంత ప్రాధాన్యత కలిగిన అంశం కాదని"పేర్కొనడం, బారతప్రభుత్వం ఎవరివైపు నిలబడిందో స్పష్టమైపోతుంది..
జంజర్ల రమేష్ బాబు,
పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఐక్య పోరాట వేదిక.
ఫోన్ :9948410798
Subscribe to:
Comments (Atom)